ఎల్లార్తి గ్రామంలో పైప్‌లైన్ పరిశుభ్రత కార్యక్రమం
1 min read
హోళగుందన్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు ఎల్లార్తి గ్రామంలో తాగునీటి పైప్‌లైన్ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రమైన తాగునీరు మరియు పారిశుద్ధ్య నిర్వహణ ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.“ప్రతి గ్రామం పరిశుభ్రతను పాటిస్తూ స్వర్ణాంధ్ర – నవ్యాంధ్ర దిశగా ముందుకు సాగాలి” అని వైకుంఠం జ్యోతి సూచించారు. గ్రామాల్లో తాగునీటి వనరులను శుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎల్లార్తి డి. మల్లికార్జున్, చిదానంద తదితరులు పాల్గొని గ్రామంలో పైప్‌లైన్ పరిశుభ్రత పనులను పరిశీలించారు. గ్రామ ప్రజలు కూడా కార్యక్రమానికి సహకరించి పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలని నాయకులు కోరారు.

