మంత్రి టీజీ. భరత్ ఆధ్వర్యంలో కర్నూలు లో క్రీడలు అభివృద్ధి
1 min read
డాక్టర్. శంకర్ శర్మ…
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలులో క్రీడలు అభివృద్ధి చెందడం ఎంతో సంతోషంగా ఉందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు లో వేసవి శిక్షణ తరగతులు క్రీడా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 80 శిబిరాలు ఏర్పాటు చేశారు. పెద్దపాడు మోడల్ స్కూల్ ఆవరణలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు డాక్టర్. శంకర్ శర్మ పౌష్టికాహారం అందజేశారు. ఈసందర్భంగా డాక్టర్. శంకర్ శర్మ విద్యార్థులతో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయించారు.డాక్టర్. శంకర్ శర్మ మాట్లాడుతూ కర్నూలు లో క్రీడల అభివృద్ధి మంత్రి టీజీ. భరత్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే చదువులతో పాటు ఉద్యోగ అవకాశాలు సైతం ఎక్కువగా వస్తాయన్నారు. ప్రస్తుతం యువత డ్రగ్స్ కు బానిస అవుతున్నారని క్రీడల్లో పాల్గొంటే డ్రగ్స్ కు దూరంగా ఉంటారన్నారు. మార్షల్ ఆర్ట్స్ లో యోగా, ప్రాణాయమం, ధ్యానం ఉంటాయని అందువల్ల మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకోవాలని కోరారు. మార్షల్ ఆర్ట్స్ వల్ల మైండ్ ను కంట్రోల్ చేసుకునే శక్తి వస్తుందన్నారు. విద్యార్థులు మంచి ఆహారంతో పాటు పండ్లు, తీసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. .ఈకార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి సంస్థ అధికారి భూపతి రావు, కోచ్ షబ్బీర్ హుస్సేన్, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

