పెదపాడు శాఖ గ్రంధాలయంలో ఉచిత వేసవి విజ్ఞాన శిబిరం
1 min read
విద్యార్థిని,విద్యార్థులకు బమ్మెర పోతన జీవిత గాధ
రిసోర్స్ పర్సన్ పిల్లల హైమావతి
గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు శాఖా గ్రంధాలయం నందు ఉచిత వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా ఆదివారం విద్యార్థిని,విద్యార్థులకు రిసోర్స్ పర్సన్ పిల్లల హైమావతి బమ్మెర పోతన జీవిత చరిత్రను విపులంగా తెలియపరచి, మందార మకరంద మాధుర్య లొలికించే ఆంధ్ర మహాభారతాన్ని రచించిన బొమ్మర పోతన అచ్చమైన తెలుగు కవి,స్వచ్ఛమైన సహజకవి అని ఆ మహనీయుని గురించి వివరించినారు. అనంతరం రిసోర్స్ పర్సన్ గుంటూరు శ్రీనివాసరావు గేయాలతో అ ఆ లూ,గుణింతాలు అనే పుస్తకం నుండి అచ్చులు, హల్లులు,గుణింతాలు,ఒత్తులు ఎలా రాయాలి,ఎలా నేర్చుకోవాలి అని విపులంగా తెలియజేసి నేర్పించారు. రిసోర్స్ పర్సన్ అట్లూరి సతీష్ సి.ప్రణయజ రచించిన చెట్టు ఎక్కిన బాతు అనే పుస్తకం నుండి “అందం తెచ్చిన అదృష్టం-మేలు చేసిన దెయ్యం” అనే కథలను విద్యార్థులచే చదివించడం, కథలు చెప్పడం,పుస్తక పఠనం చేయించడం జరిగినది. తరువాత ఆటవిడుపులో భాగంగా ఇండోర్ గేమ్స్ చెస్, లూడో,క్యారమ్స్ ఆటలు నేర్పించి ఆడించడం జరిగినది.ఈ కార్యక్రమములో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు,13 మంది విద్యార్థిని,విద్యార్థులు పాల్గొనినారు. ఈ కార్యక్రమాన్ని గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించుట జరిగినది. పాల్గొనిన విద్యార్థిని విద్యార్థులకు స్నాక్స్ పంచి పెట్టడం జరిగినదని తెలియజేశారు.


