NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హెబ్బటం గ్రామ కుంటలో యువకుడు మృతదేహం వెలికితీత

1 min read

మతిస్థిమితం లేని యువకుడు అనుమానాస్పద మృతి

ఇంటి నుండి వెళ్లిన నాలుగు రోజుల తర్వాత శవమై కనిపించిన రవికుమార్

ఆలూరు మండలం మనే కుర్తి గ్రామంలో విషాదం

భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

హోళగుందన్యూస్ నేడు:ఆలూరు మండలం మనే కుర్తి గ్రామానికి చెందిన బందిర్ల రవికుమార్ (26), తండ్రి పెద్ద నరసప్ప అను వ్యక్తి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో అప్పుడప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్లేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ క్రమంలో 13-05-2026 వ తేదీన ఇంటి నుండి బయటకు వెళ్లిన రవికుమార్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ రోజు అనగా 17-05-2026 ఉదయం హెబ్బటం గ్రామ పొలాల్లోని పెద్ద వంక కుంటలో రవికుమార్ మృతదేహం కనిపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.రవికుమార్‌కు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో నీరు త్రాగడానికి వెళ్లి కాలుజారి కుంటలో పడి మృతి చెందిన ఉండవచ్చని అతని భార్య కుప్పగళ్ళు దివ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీరాం నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

About Author