NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలపై భారీ భారం – వెంటనే ధరలు తగ్గించాలి

1 min read

: వైఎస్సార్‌సీపీ నేత ఎస్.కె గిరి

హోలగుంద న్యూస్ నేడు : హోళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్.కె గిరి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నాయని విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే ఇంధన ధరలు అధికంగా ఉన్నాయని ఆయన అన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్ ధర రూ.113.50, డీజిల్ ధర రూ.101కు చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెట్రోల్‌పై రోజుకు రూ.98.7 కోట్లు, డీజిల్‌పై రూ.180 కోట్లు చొప్పున ప్రజలపై అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు. సంవత్సరానికి పెట్రోల్‌పై రూ.1201 కోట్లు, డీజిల్‌పై రూ.2190 కోట్లు కలిపి మొత్తం రూ.3391 కోట్ల భారం ప్రజలు భరిస్తున్నారని ఆరోపించారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు “బాదుడు బాదుడు” అంటూ ప్రచారం చేసిన నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.కేరళ, తెలంగాణ రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో లీటర్‌కు రూ.3 ఎక్కువగా, కర్ణాటకతో పోలిస్తే రూ.7 ఎక్కువగా, తమిళనాడుతో పోలిస్తే రూ.10 ఎక్కువగా ధరలు ఉన్నాయని తెలిపారు. పెట్రోల్‌పై 31 శాతం, డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్ విధించడం వల్ల సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందన్నారు.అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *