ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కి వినతి
1 min read
విద్యుత్ బస్సుల నిర్వహణ ప్రవేటు ఆపరేటర్లకు అప్పగించడం సరికాదు
రిటైర్డ్/ మరణించిన పిటిడి ఉద్యోగులకు ప్రభుత్వం నుండి చెల్లించాల్సిన బకాయిలను సకాలంలో చెల్లించాలి
విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని
కె.రమేష్ కుమార్ చైర్మన్ ఏ.పీ. జెఎసి అమరావతి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆర్టీసీ ఉద్యోగులసమస్యలపై పై విద్యుత్ బస్సుల అమలుతో(ఆర్ టిసీ ప్రైవేటీకరణ) భవిష్యతులో ఆర్టీసీ ఉద్యోగులకు కలిగే ఇబ్బందులపై కె.రమేష్ కుమార్, చైర్మన్ ఏ.పి.జెఏసి. అమరావతి వారి ఆద్వర్యములో కలిసి జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి కివినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమములో బి.రాంబాబు రీజనల్ సెక్రటరీ,వై.శ్రీనివాస్, హోనేర్బుల్ ప్రసిడెంట్, ఏలూరు డిపో టి.బాబు రావు,ప్రెసిడెంట్, ఏలూరు డిపో డి.ఆంజనేయులు సెక్రెటరి, ఏలూరు డిపో ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల అనుసారం విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నాము. అయితే ఈ విద్యుత్ బస్సులను ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ సంస్థే స్వయంగా నిర్వహణ చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం, ఎటువంటి లాభాపేక్ష లేకుండా అందించడం జరుగుతుంది. కావున విద్యుత్ బస్సుల నిర్వహణ ప్రవేటు ఆపరేటర్లకు అప్పగిస్తూ వారికీ ఆర్టీసీ డిపోలను ఖాళీ చేపించి వారికీ అప్పగించడాన్ని నిలుపుదల చేయాలనీ విజ్ఞప్తి చేస్తూ విద్యుత్ బస్సులన్ని ఆర్టీసీ ద్వారా నిర్వహించాలని కోరినారు. 2012 నుండి ఆర్టీసీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేనందున ప్రస్తుతం పిటిడిలో ఉన్న ఉద్యోగులు సంఖ్య , చాల తక్కువగా ఉన్నందున స్త్రీ శక్తి పథకం అమలు తరువాత ప్రయాణికుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న కారణంగా ఉద్యోగులు తీవ్రమైన పని ఒత్తిడిలతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వెంటనే వివిధ కేటగిరీలలో 10 వేల మంది సిబ్బంది నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలి.రిటైర్డ్/ మరణించిన పిటిడి ఉద్యోగులకు ప్రభుత్వం నుండి చెల్లించాల్సిన బకాయిలను సకాలంలో చెల్లించి రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ఏ.పీ. జేఏసీ అమరావతి సంఘ నాయకులు కె రమేష్ కుమార్ కోరారు.

