నవోదయ పాఠశాలకు పేద విద్యార్థి ఎంపిక..
1 min read
మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: బనవాసి జవహర్ నవోదయ పాఠశాలలో ఆరో తరగతిలో చేరుటకు పేద విద్యార్థి ఎంపిక అయ్యారు.వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రానికి చెందిన క్రిష్టమ్మ గారి సాంబశివుడు, సావిత్రి కుమార్తె కావ్య ఎమ్మిగనూరు మండలం బనవాసి నవోదయ పాఠశాలకు ఎంపిక అయ్యారు.డిసెంబర్ 13వ తేదీన ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష రాయడం జరిగిందనివెలువడిన ఫలితాల్లో వంద మార్కులకు గాను 88 మార్కులు వచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు.ఈ పాఠశాలలో సీటు రావడం పట్ల కుటుంబ సభ్యులు పాఠశాల హెచ్ఎం ప్రేమ్ కుమార్,ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తూ అమ్మాయిని అభినందించారు.అంతేకాకుండా మిడుతూరు మోడల్ పాఠశాలలో ఆరో తరగతిలో చేరుటకు ప్రవేశపరీక్ష ఫలితాల్లో కూడా అమ్మాయి ఉత్తీర్ణత సాధించారు.కావ్య స్థానిక ఎంపీపీ పాఠశాలలో ఐదవ తరగతి చదివింది.

