NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈ నెల 20వ తేదీ ఆల్ ఇండియా సమ్మె

1 min read

చాగలమర్రిలో మెడికల్ షాపులు బంద్ …

యం ఆర్ ఓ కు వినతి పత్రం అందజేసిన చాగలమర్రి మెడికల్ షాపుల యజమాన్యులు…..

చాగలమర్రి , న్యూస్​  ( నేడు ): నంద్యాల జిల్లా మండల కేంద్రమైన చాగలమర్రి పట్టణంలో మే 20వ తేదీ అఖిల భారత కెమిస్టుల సమాఖ్య ఆల్ ఇండియా సమ్మె సందర్భంగా చాగలమర్రి తాశీల్దారుకు వినతి పత్రం అందజేశారు. చాగలమర్రిలోని పలు మెడికల్ షాపుల బంద్ కు పిలుపునివ్వాలని కోరారు.ఈ సమ్మెకు అపోలో ఫార్మసీ , మెడ్ ప్లస్ షాపు వాళ్లు కూడా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ బంద్‌కు పిలుపునిచ్చిన ఆల్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్స్‌.కోవిడ్ సమయంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని డిమాండ్‌.ఆన్‌లైన్‌లో నకిలీ, ప్రమాదకర మందులు సరఫరా చేస్తున్నారని ఆరోపణలు.ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్‌ సేవలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని డిమాండ్‌.మూతపడనున్న 12.40 లక్షలకు పైగా మెడికల్‌ షాపులు. మెడికల్ షాపుల నిర్వాహకులు మాట్లాడుతూ ఫోన్ చేస్తే అత్యవసర మందులు మాత్రమే ఇవ్వబడును అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ షాపు నిర్వాహకులు తోమ్మండ్రు నాగేంద్ర కుమార్ , శివ , మల్లెం మురళి కృష్ణ , సురేంద్ర , షేక్ మహబూబ్ హుస్సేన్ ,బడిగెంచల రఘురామ్ ,  వెంకటరమణ ,  తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *