పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి
1 min read
మంత్రాలయం న్యూస్ నేడు : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి డిమాండ్ చేశారు. వైకాపా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సోమవారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర సర్కిల్ లో బైటాయించి నిరసన వ్యక్తం చేసి అక్కడి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ గా వెళ్లి ధర్నా చేపట్టి తహసీల్దార్ రమాదేవి కి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ పెట్రోల్ డీజీల్ ధరలని పెంచమని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో అన్ని రాష్ట్రాలకంటే ఏపీ లోనే అత్యధికంగా పెట్రోల్, డీజీల్ ధరలు ఉన్నాయన్నారు. ధరలు తగ్గించకుంటే భారీ ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నిరసన చేపట్టారు.

