NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వంటగ్యాస్ ధరలను తగ్గించాలి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: ప్రజలను సాంప్రదాయ వనరుల వినియోగం వైపు మల్లీస్తున్న ప్రభుత్వం…… బహుజన ముక్తి పార్టీ…BMP .           బహుజన ముక్తి పార్టీ జాతీయ కమిటీ పిలుపు మేరకు నేడు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కేంద్రసప్రభుత్వం అనాలోచితంగా పెంచిన వంటగ్యాస్ ధరలను తగ్గించాలని పొయ్యి వెలిగించి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్బంగా బహుజన ముక్తి పార్టీ జిల్లా కన్వీనర్ దాసరి రామశేషయ్య, కోకన్వీనర్ ఎన్ కే జయన్న మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం కేవలం ఐదునెలల కాలంలోనే కనివిని ఎరుగని రీతిలో వంటగ్యాస్ గృహ మరియు వాణిజ్య అవసరాల వినియోగపు ధరలను పెంచి సాధారణ ప్రజలను గ్యాస్ వినియోగానికి దూరం చేసిందని పశ్చిమాశియా యుద్ధన్ని బూచిగా చూపించి ప్రజల నడ్డివిరిచిందన్నారు. 2014 లో 414 రూపాయలు ఉన్న గృహ వినియోగపు గ్యాస్ ధర 2026నాటికీ 1000 పెంచి ప్రజలు తిరిగి కట్టెల పొయ్యి వాడే విధంగా మార్చిందన్నారు. అదేవిధంగా వాణిజ్య అవసరాలకు వినియోగించే 19kg ల గ్యాస్ ధరను 2014లో 1080కాగా మే 2026నాటికీ 3071 పెంచింది. కేవలం ఒక్క మే నెలలోనే 993రూపాయలు పెంచి 3071రూపాయలు చేసింది. దీనిమూలంగా చిరు వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయే విధంగా చేసింది. హోటల్ వ్యాపారులు పెరిగిన గ్యాస్ ధరలను దృష్టిలో ఉంచుకొని ఆహారపు ధరలను విపరీతంగా పెంచారు. ఒకవైపు చిరువ్యాపారులు 3071 రూపాయలు పెట్టి గ్యాస్ కొనలేక కొట్టుమూసి రోడ్డున పడ్డారు. ఒకవైపు గ్యాస్ కొరత లేదంటూనే ధరలను పెంచి ప్రజలను దోచుకోవటం దేశాద్రోహం ప్రజాద్రోహం కదా. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దేశాన్ని దోచిపెట్టటం మాని మానవతా విలువలతో ప్రజలకు ప్రజామోద్యయోగ్యమైన పనులు చేయాలి పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని బహుజన ముక్తిపార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.ఈ నిరసన కార్యక్రమం లో నాయకులు పి. రంగస్వామి. సురేష్ దినకర్ మొదలుగువారు పాల్గొన్నారు.

About Author