NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయి పిల్లలు అనాధలుగా మిగిలి పోకూడదు

1 min read

కె.వెట్రిసెల్వి భరోసా

జిల్లా బాలల రక్షణ విభాగం, జిల్లా శిశుసంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రధానమంత్రి పిల్లల సంరక్షణ పథకం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో బుధవారం మిషన్ వాత్సల్య పథకం – జిల్లా బాలల రక్షణ విభాగం, జిల్లా శిశుసంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రధానమంత్రి పిల్లల సంరక్షణ పథకం లబ్ధిదారులతో సంభాషణ మరియు ఆర్థిక అక్షరాస్యత శిక్షణా కార్యక్రమం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. కోవిడ్ 19 కాలంలో తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయి అనాధలుగా మిగిలి పోకూడదని అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పిఎంకేర్స్ ఆర్ఫాన్ చిల్డ్రన్స్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్న 56 మంది లబ్ధిదారులతో  ఆత్మీయ సమావేశంలో జిల్లా కలెక్టరు ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ 22 మంది బాలలను వారి యొక్క ఆరోగ్యము, చదువు, వసతి వివరాలతో పాటు వారి యొక్క ఆర్థిక ప్రగతికి అభివృద్ధి చెందే మార్గాలను అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు జిల్లాలో ఉన్న 22 మంది బాలలు, కొవ్వూరు డివిజన్ సంబంధించి ముగ్గురు బాలలు, వెస్ట్ గోదావరి భీమవరంకి సంబంధించి 13 మంది బాలలతో వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వీరిలో 18 సంవత్సరాలు వయసు పూర్తి చేసుకుని ఉన్న 13 మంది బాలలకు పోస్టల్ డిపార్ట్మెంటు ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలు గురించి మరియు ఇతర సౌకర్యాలు గురించి వివరించి పోస్టల్ డిపార్ట్మెంటు సూపర్డెంటు సుబ్రహ్మణ్యం ద్వారా తెలియ జేయడమైనదని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా  మహిళా శిశుసంక్షేమ సాధికారతాధికారి పి.శారద , జిల్లా బాలల సంరక్షణ అధికారి సి.హెచ్. సూర్యచక్రవేణి, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.యు.శోభ, జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ జిల్లా అధికారి యన్.జితేంద్రబాబు,సైకియాట్రిస్ట్ డాక్టరు వంశీకృష్ణ, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటరు డాక్టరు రాజీవ్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఏఎల్ఎస్ కో-ఆర్డినేటరు సొంగా నాగేశ్వర రావు, జిసిడిఓ నవీన, పోస్టల్ డిపార్ట్మెంటు సూపరిండెంటు సుబ్రహ్మణ్యం, లీడ్ బ్యాంకు మేనేజరు వారి సిబ్బంది, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుండి లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు వారి సంరక్షకులు, డిసిపియు సిబ్బంది శ్రీకాంత్, బాలస్వామి, రాజేష్, రాజకుమార్, మహేష్, మాధవి తదితరులు హాజరైనారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *