NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెదపాడు శాఖా గ్రంధాలయం లో ఉచిత వేసవి విజ్ఞాన శిబిరం

1 min read

దళిత బహుజన రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్  గోసాల ఝాన్సీ రాణి

గ్రంథాలయాధికారి దుగ్గిపోగు జాన్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు శాఖా గ్రంధాలయం నందు ఉచిత వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా బుధవారం విద్యార్థిని, విద్యార్థులకు రిసోర్స్ పర్సన్ దళిత బహుజన రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్  గోసాల ఝాన్సీ రాణి ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాల గురించి  తెలియజేస్తూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రి, సంఘసంస్కర్త మరియు భారత రాజ్యాంగ రూపశిల్పి, అంటరానితనం,కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శం.ఆయన ఏప్రిల్ 14 1891న “సుబేదార్ రాంజీ సక్పాల్, బీమా బాయి” దంపతులకు 14వ సంతానముగా “మౌ” (ఇప్పటి మధ్యప్రదేశ్) లో జన్మించారు.వారి  స్వగ్రామం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అమ్మవాడ గ్రామం. పేదరికం,కుల వివక్షను ఎదుర్కొని కొలంబియా యూనివర్సిటీ మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఉన్నత పట్టాలు( PhD,Dsc) సాధించారు. కుల వ్యవస్థ అంటారని తనంపై పోరాడటానికి “బహిష్కృత హితకారిణి” సభ ను స్థాపించారు. దళితులకు చెరువు నీరు తాగే హక్కు కోసం “మహద్ సత్యాగ్రహం” నిర్వహించారు దేవదాసి వ్యవస్థ, బాల్యవివాహాలను తీవ్రంగా వ్యతిరేకించారు. 1947లో స్వాతంత్ర భారతదేశనికి మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన “ముసాయిదా కమిటీ” కి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. బౌద్ధ మత తత్వశాస్త్రం పై ఆకర్షితులై 1956 అక్టోబర్ 14న లక్షలాదిమంది అనుచరులతో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. డిసెంబర్ 6-1956న తుది శ్వాస విడిచారు అని తెలియజేసి,బాలల కోసం “భారత రాజ్యాంగ ప్రవేశిక” అనే బొమ్మల పుస్తకాలు విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు. అనంతరం  డి.కె. చదువుల బాబు రచించిన మాయ విసనకర్ర అనే పుస్తకం నుండి చలపతి తెలివి- దేవుడు తీర్చిన కోరికలు* అనే నీతి కథలను విద్యార్థులచే చదివించడం,కథలు చెప్పించడం, పుస్తక సమీక్ష చేయించడం జరిగినది. తరువాత బాల,బాలికలతో ఇండోర్ గేమ్స్ లూడో-చెస్- క్యారమ్స్ ఆటలు నేర్పించి ఆడించడం జరిగినది. తరువాత బడి పిలుస్తుంది అందరం భాగస్వాములు అవుదాం అనే కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు,15 మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొనినారు.ఈ కార్యక్రమం గ్రంథాలయాధికారి దుగ్గిపోగు జాన్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.పాల్గొనిన విద్యార్థిని, విద్యార్థులకు స్నాక్స్ మరియు డ్రింక్స్ అందజేయడం జరిగినదని తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *