జీవితంలో బాల్యం ఎంతో గొప్పది…డాక్టర్. శంకర్ శర్మ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలులో పార్కులు, మైదానాలు అభివృద్ధి చెందడం ఎంతో సంతోషంగా ఉందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు లో వేసవి శిక్షణ తరగతులు క్రీడా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 80 శిబిరాలు ఏర్పాటు చేశారు. కర్నూలు బుధవార పేటలోని పార్క్ ఆవరణలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు డాక్టర్. శంకర్ శర్మ పౌష్టికాహారం అందజేశారు. ఈసందర్భంగా డాక్టర్. శంకర్ శర్మ బుధవార పేట లాంటి స్లం ఏరియాలో చక్కటి పార్క్ ఏర్పాటు చేశారని దీని వల్ల చిన్నారులు క్రీడల్లో రాణించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని డాక్టర్. శంకర్ శర్మ తెలిపారు.కర్నూలులో క్రీడాకారులు అభివృద్ధి చెందేందుకు మంత్రి టీజీ. భరత్ తోపాటు క్రీడల అభివృద్ధి అధికారి భూపతి రావు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు మంచి ఆహారంతో పాటు పండ్లు, తీసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. .ఈకార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి సంస్థ అధికారి భూపతి రావు, కోచ్ రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

