2,09,347 రూ.ల సీఎంఆర్ఎఫ్ పంపిణీ
1 min read
లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే..
మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: అర్హులైన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి అందజేయడమే ముఖ్య ఉద్దేశమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామంలో గురువారం ఉదయం ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి మొదటి ఎమ్మెల్యే గిత్త జయసూర్య మరియు నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి ఆరుగురికి కలిపి 2 లక్షల 9వేల 347 రూ.ల సీఎంఆర్ ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.పైపాలం గ్రామానికి చెందిన బోయ రంగన్నకు 40,599 రూ.లు..పీరు సాహెబ్ పేటలో వడ్డే రంగస్వామికి -17,392 రూ.లు,దేరెడ్డి మురళీధర్ రెడ్డి-30,600,కైపా చంద్ర పుల్లారెడ్డి-25 వేలు,మిట్టమీద సాయిబాబా-40,070,వడ్డే చిన్న ఎల్లన్న-55,686 రూపాయలు మంజూరైన చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, ఎంపీడీవో దశరథ రామయ్య, తహసిల్దార్ శ్రీనివాసులు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విశ్వనాథ్, నాయకులు డి జయ రాముడు,రామేశ్వర్ రెడ్డి,దే రెడ్డి వెంకటేశ్వర రెడ్డి,మర్రి కుంట మహేశ్వర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి,మరియు పంచాయతీ కార్యదర్శి నాగమణి తదితరులు పాల్గొన్నారు.

