NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ బడిలో చేర్పిద్దాం… ఊరు బడిని కాపాడుకుందాం

1 min read

టిడిపి గ్రామ అధ్యక్షుడు బత్తిన రాజశేఖర్

న్యూస్ నేడు, పత్తికొండ : బడి పిలుస్తుందనే కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ పిలుపుమేరకు ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం…ఊరు బడిని కాపాడుకుందాం అనే నినాదంతో పత్తికొండ మండల పరిధిలోని నలకదొడ్డి గ్రామంలో ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా టిడిపి గ్రామ అధ్యక్షుడు బత్తిన రాజశేఖర్ నేతృత్వంలో పుర వీధుల గుండా వినూత్న రీతిలో మంగళవారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బత్తిన రాజశేఖర్,ఉపాధ్యాయులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల ప్రత్యేకతను ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు.ప్రభుత్వ బడులు ఊరికి గర్వకారణం అని పిల్లలను ఊరి బడిలో చేర్పించడం తల్లిదండ్రులు సగర్వంగా భావించాలని కోరారు. ప్రపంచం గర్వించదగా మేధావులంతా ప్రభుత్వ పాఠశాలలోనే చదవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్న ప్రభుత్వ పాఠశాలను రక్షించుకోకపోతే భవిష్యత్తు అంధకారంగా మారుతుందని హెచ్చరించారు.బడి వయసున్న బడి పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ పూలరంగడు,లక్ష్మిరెడ్డి,రఘు శేఖర్,కుబేర, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కౌలుట్లయ్య, పాఠశాల ఉపాధ్యాయులు గ్రామపెద్దలు తదితరుల పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *