పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తా
1 min read
ఎంహెచ్ ఓ నారాయణ
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఆర్.లక్ష్మీనారాయణ చెప్పారు. ఏలూరు కార్పొరేషన్ ఎంహెచ్ఓ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీనారాయణను ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను భజంత్రీ శ్రీనివాస్ ఎంహెచ్ఓ కు వివరించారు. అదేవిధంగా కార్మికులకు రావాల్సిన రాయితీల విషయాన్ని పాలకవర్గం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సకాలంలో అందజేసే విధంగా కృషి చేయాలని ఎంహెచ్ఓను కోరారు. దీనిపై స్పందించిన ఎంహెచ్ ఓ లక్ష్మీనారాయణ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తా అన్నారు. అలాగే కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తితే నేరుగా తనను కలిసి సమస్య తెలియజేస్తే వాటిని కమిషనర్, మేయర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏలూరు నగర సమితి ప్రధాన కార్యదర్శి దడ్డికర్ల నాగబాబు, ఉపాధ్యక్షులు బంగారు అంకమ్మ, పేడారి వంశీ, సహాయ కార్యదర్శి కాకాని సుబ్బారావు, బంగారు భవాని, బండి సతీష్, యూనియన్ సభ్యులు పైడి శంకర్ తదితరులు ఎంహెచ్ఓ కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

