మన ఊరు – మన జెండా కార్యక్రమానికి ప్రజల విశేష స్పందన
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని మామిళ్లపల్లి మరియు బోయిన చెరువుపల్లి గ్రామాలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “మన ఊరు – మన జెండా” కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. కార్యక్రమం అనంతరం గ్రామాల పెద్దలు, యువత మరియు పలు కుటుంబాలు భారీ సంఖ్యలో భారతీయ జనతా పార్టీలో చేరారు.ఈ కార్యక్రమానికి బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ అభిరుచి మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్యాపిలి మండల అధ్యక్షులు దామోదర్ నాయుడు అధ్యక్షతన, మండల ఇన్చార్జ్ అంబటి సుబ్బారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సందు వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఒంటెద్దుబండి కిరణ్, కిసాన్ మోర్చా రాయలసీమ జోన్ ఇన్చార్జ్ తిమ్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కేసీ మద్దిలేటి, బీజేపీ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ భాస్కర్ సొప్పాకుల, యువ మోర్చా ప్యాపిలి మండల అధ్యక్షుడు పీ. శివ కేశవ్ హాజరయ్యారు.అనంతరం మామిళ్లపల్లి గ్రామంలో చక్క మద్దిలేటి, మైల మహేంద్ర, ఓబులరెడ్డి, సాయి, మల్లికార్జున, సోమశేఖర్, నాగేశ్వరరావు, పెద్ద ఓబయ్య, సుంకన్న, రంగస్వామి, లక్ష్మిరెడ్డి, రామచంద్ర, నాగేష్ తదితర యువకులు బీజేపీలో చేరారు. అలాగే బోయిన చెరువుపల్లి గ్రామంలో మల్లయ్య, వెంకటరాముడు, రాజు, శ్రీనివాసులు, గాజుల వెంకటరాముడు మరియు వారి అనుచరులతో కలిసి సుమారు 10 కుటుంబాలు భారతీయ జనతా పార్టీలో చేరాయి.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు డాక్టర్ అభిరుచి మధు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజలు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. పేదల సంక్షేమం,ః రైతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం అనేక చారిత్రాత్మక కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు.


