NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హోం గార్డ్స్ కుటుంబాలకు రూ.4 లక్షల  ఆర్థిక సహాయం

1 min read

చెక్కులు అందజేసిన …హోంగార్డ్స్ సదరన్ రిజియన్ కమాండెంట్  శ్రీ యం. మహేష్ కుమార్

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు హోం గార్డ్స్ కాంట్రిబ్యూషన్ ఫండ్ నుండి మంజూరైన చెక్కులను జిల్లా పోలీసు కార్యాలయంలో  హోం గార్డ్స్ సదరన్ రీజియన్ కమాండెంట్ శ్రీ యం. మహేష్ కుమార్ గురువారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.కాంట్రిబ్యూషన్ ఫండ్ నుండి మంజూరైన మొత్తం రూ.4 లక్షల విలువైన రెండు చెక్కులను హోం గార్డ్స్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆదోని యూనిట్‌కు చెందిన హోం గార్డు వెంకటేశులు పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్ గ్రాంట్ కింద రూ.2 లక్షల చెక్కును అందజేశారు.కర్నూలు యూనిట్‌కు చెందిన  హోంగార్డు కృష్ణ మృతి చెందారు.  అతని భార్య సునీత కు మరణానంతర సహాయంగా రూ.2 లక్షల చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో హోం గార్డు ఆర్‌ఐ పోతల రాజు, ఏఆర్ ఎస్సైలు కాంతరెడ్డి, ఎం. మహేశ్వరయ్య, మల్లికార్జున రెడ్డి, పోలీసు సిబ్బంది మరియు హోం గార్డ్స్ పాల్గొన్నారు.

About Author