NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సమస్యలెన్నొచ్చినా పరిష్కారమే పరమావధిగా పటిష్ట అడుగులు వేస్తున్నాం

1 min read

జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడి

ప్రజలెవ్వరూ అధైర్యపడొద్దు ప్రజాభిప్రాయమే పరమావధిగా, జనరంజక పాలనే లక్ష్యంగా, ప్రజాదర్బార్‌కు శ్రీకారం

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సమస్యలెన్నొచ్చినా పరిష్కారమే పరమావధిగా పటిష్ట అడుగులు వేస్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ఈ విషయంలో ప్రజలెవ్వరూ అధైర్యపడొద్దని ఆయన భరోసా కల్పించారు. ప్రజాభిప్రాయమే పరమావధిగా,,, జనరంజక పాలనే లక్ష్యంగా ప్రజాదర్బార్‌కు శ్రీకారం చుట్టారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి.. ప్రజా గొంతుకకు పట్టాభిషేకం చేస్తూ, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతోన్న ఆయన ఆ సదాశయాన్ని సమున్నత లక్ష్యం దిశగా మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. దానిలో భాగంగానే ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణతో రంగంలోకి దిగారు ఎమ్మెల్యే బడేటి చంటి. శుక్రవారం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌ కార్యక్రమానికి తరలివచ్చిన వివిధ ప్రాంతాలకు చెందిన సామాన్యుల నుండి ఆయన వినతులను స్వీకరిస్తూ వారి సమస్యలను సావధానంగా ఆలకించారు. ప్రతీ సమస్యను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. బాధ ఏదైనా, సమస్య ఎటువంటిదైనా నేనున్నానంటూ కొండంత అండను, గుండె నిండా ధైర్యాన్ని నింపారు. కేవలం అర్జీలు తీసుకోవడమే కాదూ,, బాధితుల కన్నీరు తుడిచేలా, సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలంటూ సంబంధిత అధికారులను ఎమ్మెల్యే బడేటి చంటి అక్కడికక్కడే ఆదేశించారు. ప్రజాశ్రేయస్సే శ్వాసగా క్షేత్రస్థాయి సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తూ జనరంజక పాలనను ప్రజల చెంతకు చేరవేసేందుకు విశేషంగా కృషిచేస్తున్నామని ఈ సందర్భంగా బడేటి చంటి స్పష్టం చేశారు. టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం మాట్లాడుతూ ఏలూరు అసెంబ్లీ నియోజవర్గంలో ప్రజా సమస్యల స్వీకరణా ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందన్నారు. ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో ఇప్పటికే అనేక ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలు లభించాయన్న ఆయన రానున్న రోజుల్లో మరిన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, డిప్యూటి మేయర్ కర్రి శ్రీనివాస్‌, కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు బడిశెట్టి శ్రీనివాస్‌, లంకపల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *