NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రేపటితో ముగియనున్న ఎల్‌ఆర్‌యస్ మేళా

1 min read

ఎల్‌ఆర్‌యస్ దరఖాస్తుల పెండింగ్ సమస్యలకు ప్రత్యేక పరిష్కారం

ఫీజు చెల్లింపులు, షార్ట్‌ఫాల్ పత్రాలు, అప్రూవల్ ప్రొసీడింగ్స్ ఒకేచోట

చివరి అవకాశాన్ని వినియోగించుకోవాలి

నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు సూచన

కర్నూలు, న్యూస్​ నేడు:  శుక్రవారం నగర పరిధిలో అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఎల్‌ఆర్‌యస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) కు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ప్రజల కోసం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎల్‌ఆర్‌యస్ మేళా శనివారంతో ముగియనుందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి నిర్వహించిన మేళాకు విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు. స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఎల్‌ఆర్‌యస్ దరఖాస్తులకు సంబంధించిన షార్ట్‌ఫాల్ పత్రాలు, ఫీజు ఇంటిమేషన్, చెల్లింపులు, అప్రూవల్ ప్రొసీడింగ్స్ తదితర అంశాలను ఒకేచోట పరిష్కరించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లింపులు లేదా అవసరమైన పత్రాల సమర్పణలో పెండింగ్‌లో ఉన్న వారికి ఈ మేళా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.పట్టణ ప్రణాళిక అధికారులు, ప్లానింగ్ కార్యదర్శులు, ఎల్‌టిపిలు అందుబాటులో ఉండటంతో దరఖాస్తుదారులు అక్కడికక్కడే తమ సమస్యలను పరిష్కరించుకుని అప్రూవల్ ప్రొసీడింగ్స్ పొందవచ్చని తెలిపారు. శనివారంతో ఈ ప్రత్యేక మేళా ముగియనున్నందున ప్రజలు చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆస్తులకు పూర్తి చట్టబద్ధత కల్పించుకోవాలని కమిషనర్ కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *