విద్యార్థులను ఉన్నత వంతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే పినాక లక్ష్యం
1 min read
చెన్నై ఆదాయపన్ను శాఖ కమిషనర్ బి.యాదగిరి
కర్నూలు , న్యూస్ నేడు: పినాక ప్రజా సాధికార ట్రస్ట్ ద్వారా విద్యార్థులను ఉన్నతమంతమైన పౌరులుగా తీర్చిదిద్దరమే పినాక లక్ష్యమని ఐఆర్ఎస్ అధికారి బి.యాదగిరి అన్నారు పినాక ప్రజా సాధికార ట్రస్ట్ ఆధ్వర్యంలో కర్నూల్ నగరంలోని ఎన్.ఆర్.పేట లో గల శ్రీలక్ష్మీ హైస్కూల్లో 21 రోజులపాటు విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్,కమ్యూనికేషన్స్,స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్,గ్రూప్స్,సివిల్స్ పై గైడెన్స్ కోర్సు శిక్షణ తరగతుల సందర్భంగా ఆయన పినాక తరగతులకు హాజరై గ్రూప్స్ మరియు సివిల్స్,ఇంటర్వ్యూ స్కిల్స్ పై విద్యార్థులకు శిక్షణను ఇచ్చారు అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అమీలియా హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్ష్మీప్రసాద్,న్యూరో ఫిజీషియన్ డాక్టర్ నర్సరాం, కల్లూరు మండల తాసిల్దార్ కే.ఆంజనేయులు,శ్రీ లక్ష్మీ విద్యాసంస్థల డైరెక్టర్ పీ.దీక్షిత్, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పినాక కర్నూలు సెంటర్ కోర్సు డైరెక్టర్ రాయలసీమ రవికుమార్ పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆదాయపన్ను శాఖ కమిషనర్ బి.యాదగిరి మాట్లాడుతూ పేద గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నతమైన పౌరులుగా,మంచి ఉద్యోగులుగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో 2014వ సంవత్సరంలో పినాక ప్రజా సాధికార ట్రస్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు చిత్తూరు జిల్లాలో రెండు కేంద్రాలతో ప్రారంభమైన పినాక శిక్షణ తరగతులు నేడు రాయలసీమ వ్యాప్తంగా ఎనిమిది కేంద్రాలలో ఉచితంగా శిక్షణనిస్తున్నామని ఇప్పటివరకు 6500మంది విద్యార్థిని,విద్యార్థులు ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్,పర్సనాలిటీ డెవలప్మెంట్,గ్రూప్స్,సివిల్స్,గైడెన్స్ కోర్సులో శిక్షణ పొందారని చాలామంది ఉద్యోగాల్లో సైతం ఉన్నారని అన్నారు. అలాగే కల్లూరు మండల తాహసిల్దార్ కే.ఆంజనేయులు అమీలియో హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్ష్మీప్రసాద్,ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ నరసరాం మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా విద్యనందించడం అంటే దేశానికి ఉన్నతవంతమైన పౌరులను తీర్చిదిద్ది అందించడమేనని ఈ బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన యాదగిరి సంకల్పం గొప్పదని పినాక సంస్థ కార్యక్రమంలో వారి తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. శ్రీ లక్ష్మీ విద్యాసంస్థల డైరెక్టర్ పి. దీక్షిత్,రాయలసీమ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షులు,పినాక కర్నూలు సెంటర్ కోర్సు డైరెక్టర్ రాయలసీమ రవికుమార్ మాట్లాడుతూ పినాక సంస్థలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షులు కె. బలరాం,గణిత అధ్యాపకులు ఈశ్వరయ్య,కురువ సంఘం నాయకులు రంగస్వామి,గుడిసే శివన్న,మదాసికురువ సుంకన్న,కురువ ఎల్లప్ప,బత్తిన కిరణ్ కుమార్, టకురువ ధనుంజయ,కేసీ నాగన్న,బిల్డర్ వెంకటేశ్వర్లు,కె.భరత్ కుమార్,కే.రాము తదితరులు పాల్గొన్నారు.


