దేవరగట్టులో భక్తుల రద్దీ
1 min read
శ్రీ మళమాల్లేశ్వర స్వామివారికి విశేష పూజలు – భక్తులకు అన్నదానం
హోళగుందన్యూస్ నేడు: ఆదివారం సందర్భంగా దేవరగట్టులోని ప్రసిద్ధ శ్రీ మళమాల్లేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం భక్తులతో కిటకిటలాడింది.ఈ సందర్భంగా శ్రీ మళమాల్లేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకం, బిల్వార్చన, బండారు అర్చనలు ఘనంగా నిర్వహించారు. అలాగే అమ్మవారికి కుంకుమార్చన, ఆకు పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడినాయి.ఆలయ అర్చకులు గిరి స్వామి, మనోహర్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులకు కుంకుమ, బండారు అట్టిస్తూ ఆశీర్వాదాలు అందజేశారు.దేవస్థానానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రసాద వితరణ చేశారు. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

