స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు బగ్గీ అంబులెన్స్ ను విరాళంగా అందజేత
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూలు కు స్నేహ శ్రీ వెల్ఫేర్ సొసైటీ , కర్నూలు వారు మరియు శ్రీ వెంకట రమణ , వారి తండ్రి కీర్తి శేషులు శ్రీ సంగి శెట్టి లక్ష్మయ్య జ్ఞాపకార్థం ఏడున్నర లక్షల రూపాయలు విలువగల బగ్గీ అంబులెన్స్ ను విరాళంగా ఇచ్చారు. ఈ బగ్గీ అంబులెన్స్ వేరే విభాగాలలో చికిత్సలు అవసరమయిన క్యాన్సర్ రోగులను స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలోని వివిధ వైద్య విభాగాలకి తరలించడానికి మరియు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి నుంచి స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు క్యాన్సర్ రోగులను తరలించడానికి ఉపయోగిస్తారు. ఈ బగ్గి అంబులెన్స్ ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ టి. జి. భరత్ ప్రారంభించారు. ఈ కార్య క్రమం లో పాణ్యం శాసన సభ్యురాలు శ్రీమతి గౌరు చరిత , కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ చిట్టి నరసమ్మ , గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు , హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు డాక్టర్ ప్రవీణ్ , శ్రీ సాయి ప్రవీణ్ , శ్రీమతి పద్మజ , పవర్ గ్రిడ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బుర్రా రామ్ మోహన్ వంశీ మరియూ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సభ్యులు , మెడికల్ కాలేజీ, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మరియు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూలు డైరెక్టర్ డాక్టర్ సి ఎస్ కే ప్రకాష్ స్నేహ శ్రీ వెల్ఫేర్ సొసైటీ వారిని అభినందించారు మరియు దాత శ్రీ వెంకట రమణ ని సన్మానించారు.

