సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహణ
1 min read
పేద ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం – వైకుంఠం జ్యోతి
ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీమతి వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మొత్తం ఆరు మండలాలకు సంబంధించిన 18 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.దేవనకొండ మండలానికి చెందిన లబ్ధిదారులకు ఈ సందర్భంగా చెక్కులను అందజేశారు. అందులో గువ్వల నరేష్ నాయుడు కు రూ.89,384, తలారి శంకరమ్మ కు రూ.35,584, గజ్జెల శిరీష కు రూ.41,729, బి. నాగయ్య కు రూ.40,918, తోలు తేజశ్రీ కు రూ.58,423 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ పేద ప్రజలకు ఆపద సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరంగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ విజయ్ భాస్కర్ గౌడ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మల్లేపల్లి రంగుడు, సొసైటీ చైర్మన్ రాజశేఖర్ గౌడ్, రామారావు నాయుడు, మల్లికార్జున గౌడ్, రామదాస్ గౌడ్, బండిగింజల రంగన్న, ఆకుల వీరేష్, కప్పట్రాళ్ల మల్లికార్జున, వెంకటస్వామి గౌడ్, రాజుగోపాల్ గౌడ్, గుడిమిరాళ్ల కౌలుట్ల శేషిరెడ్డి, బండపల్లి శ్రీనివాసులు, గద్దెరాళ్ల సూరన్న తదితరులు పాల్గొన్నారు.

