ఆరోగ్యమే అసలైన ఆస్తి – ముందస్తు జాగ్రత్తలే ప్రాణ రక్షణ: ఎమ్మెల్యే
1 min read
పెనమలూరు , న్యూస్ నేడు: ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో,వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్న 36 మంది లబ్ధిదారులకు సుమారు ₹22 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ అందజేశారు.పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాధితుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకుని చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంతకంటే ముఖ్యమని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అనారోగ్యానికి గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు, సరైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి తప్పనిసరిగా పాటించాలి” అని సూచించారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు అవసరమైన సమయంలో సహాయం అందించే విధంగా ముఖ్యమంత్రి సహాయనిధి సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు.గత ప్రభుత్వంలో సహాయనిధి చెక్కుల పంపిణీ చాలా అరుదుగా కనిపించేదని,ప్రస్తుతం ప్రజలు పెద్ద సంఖ్యలో సహాయనిధి,LOCల కోసం కార్యాలయాలకు వస్తుండటం ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.స్తోమత ఉన్న ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలని, భవిష్యత్తులో ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.నియోజకవర్గంలో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని,ప్రజల మద్దతుతో మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని అన్నారుఈ కార్యక్రమంలో తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్ రావు పెనమలూరు మండల పార్టీ అధ్యక్షులు కోయ ఆనంద ప్రసాద్ రాష్ట్ర గౌడ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ తాతపూడి గణేష్ బీసీ సెల్ అధ్యక్షులు సంగేపు రంగారావు ఏ కుల విజయంద్ర మారుపూడి ధన కోటేశ్వరరావు జంపాల గురునాథం తుమ్మల రామ్ కుమార్ అంగిరేకుల మురళి యార్లగడ్డ సుచిత్ర ముక్కామల విగ్నేష్ చౌదరి జంపన వెంకటేశ్వరరావు ముసునూరు శ్రీధర్ బొంగరాల అబ్రహం కూటమి నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

