NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

1998-2000 ఇంటర్మీడియట్ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ-గెట్ టుగెదర్

1 min read

25 సంవత్సరాలు పూర్తి కావడంతో ఆత్మీయ కలయిక ఏర్పాటు

 నాటి అధ్యాపకుల బోధన తోనే నేడు ఉద్యోగులుగా స్థిరపడ్డాం

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దెందులూరు నియోజకవర్గం పెదవేగి లోని ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో 1998-2000 లో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు  సిల్వర్ జూబ్లీ-గెట్ టుగెదర్ స్థానిక కుబేర కాన్ఫరెన్స్ హాల్ లో కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది.నాటి కళాశాల మొదటి బ్యాచ్ విద్యార్థులు. 25 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈ ఆత్మీయ కలయికను ఒకే వేదికపై  ఏర్పాటు చేయటం జరిగింది. ప్రస్తుతo ఒకరి నొకరు కుటుంబ యోగక్షేమాలను తెలుసుకోవడం.  మిత్రులందరు కలుసుకుని  చిన్ననాటి చిలిపి చేష్టల జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడంతో వారి నవ్వులలో పువ్వులు వికసించాయి. ఇటువంటి బృహత్తర ఆలోచన కార్యక్రమం నిర్వహించి ఏర్పాటు చేసినవారికి ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలియజేశారు. మిత్రులందరు కలుసుకుని వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం పట్టలేని ఆనందాన్ని సంతోషాన్ని ఒక మధుర క్షణాలుగా మిగిల్చాయని విచ్చేసిన ప్రతి ఒక్కరూ కొనియాడారు.వీరులో అనేకమంది గ్రూప్ వన్ ఆఫీసర్స్ , సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ , లెక్చరర్స్ మరియు ఉపాధ్యాయులుగా, వ్యాపారస్తులుగా  స్థిరపడటానికి కారకులు నాటి అధ్యాపకులు, పోటీ తత్వంతో మేమందరం చదివిన విద్యయే నేటి ఈ స్థితికి  కారణం అన్నారు.ఈ కార్యక్రమంలో నాడు  బోధించిన అధ్యాపకులు లక్ష్మయ్య , సురేష్ కుమార్, మదన్ ,భాస్కర్ రెడ్డి, మధుశుదన్, వెంకటరమణ తదితరులు పాల్గొని. మరెందరో విద్యార్థినీ విద్యార్థులకు మీ కృషితో సహాయ సహకారాలతో ఉన్నతంగా ఎదగాలని,మీరు వారికి ఆదర్శంగా నిలవాలని  ఆకాంక్షించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *