సోదరభావంతో బక్రీద్ వేడుకలు జరుపుకుందాం
1 min read
శాంతి భద్రతల కోసం ప్రజల సహకారం అవసరం
ఆలూరు సీఐ రవిశంకర్ రెడ్డి, హోళగుంద ఎస్సై దిలీప్ కుమార్
హోళగుంద న్యూస్ నేడు: రాబోయే బక్రీద్ పండుగను గ్రామాల్లో,పట్టణాల్లో శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఆలూరు సీఐ రవిశంకర్ రెడ్డి, హోళగుంద ఎస్సై దిలీప్ కుమార్ గురజాల ప్రజలకు పిలుపునిచ్చారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో హోళగుంద పోలీస్ స్టేషన్లో సోమవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముస్లిం మత పెద్దలు, గ్రామ పెద్దలు, వివిధ వర్గాల నాయకులు, యువకులు మరియు పోలీస్ సిబ్బంది హాజరయ్యారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పండుగలు సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం మరియు సోదరభావాన్ని పెంపొందించే వేదికలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మత సామరస్యాన్ని కాపాడుతూ ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని సూచించారు.సోషల్ మీడియాలో వ్యాపించే తప్పుడు ప్రచారాలు, వదంతులను నమ్మకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.బక్రీద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక బందోబస్తు, పర్యవేక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి పండుగను ప్రశాంతంగా ముగించేందుకు భాగస్వాములు కావాలని కోరారు.ఈ సమావేశంలో ఇరు వర్గాల ప్రముఖులు, గ్రామ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


