రోగులకు స్వాంతన, సంరక్షణ అందించడమే పాలియేటివ్ కేర్ లక్ష్యం
1 min read
అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. కామేశ్వర ప్రసాద్..
కర్నూలు వైద్య కళాశాల,కర్నూలు సర్వజన వైద్యశాల మరియు రాష్ట్ర క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ల ఆధ్వర్యంలో పాలియేటివ్ కేర్ శిక్షణ కార్యక్రమం
కర్నూలు, న్యూస్ నేడు: రోగులకు స్వాంతన, సంరక్షణ, ఆత్మవిశ్వాసాన్ని అందించడమే పాలియేటివ్ కేర్ యొక్క ప్రధాన లక్ష్యమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కామేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. బుదవారం నాడు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని రాష్ట్ర క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ యందు జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “పాలియేటివ్ కేర్ సెన్సిటైజేషన్ మరియు శిక్షణ కార్యక్రమ” ప్రారంభ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రాణాంతక మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు నొప్పి నివారణతో పాటు మానసిక ధైర్యాన్ని కల్పించడంలో పాలియేటివ్ కేర్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాలియేటివ్ కేర్ సేవలను జిల్లా స్థాయికి విస్తరించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు.రాష్ట్ర క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డా. సి.ఎస్.కె. ప్రకాష్ మాట్లాడుతూ, కర్నూలులోని రాష్ట్ర క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో క్యాన్సర్ నొప్పి మరియు పాలియేటివ్ కేర్ యూనిట్‌ను 2019 మే 19న జిజిహెచ్ లో ప్రారంభించబడి తదుపరి అదే ఆవరణం లో ఉన్న స్టేట్ కాన్సర్ ఇన్స్టిట్యూట్ లోనికి మార్చడం జరిగింది అని తెలిపారు. ఈ కేంద్రం కర్నూలు మెడికల్ కళాశాల తొలి బ్యాచ్ విద్యార్థిని డా. సుశీల రెడ్డి సహకారంతో, కెనడాలోని వాంకోవర్‌కు చెందిన ట్రూ వరల్డ్ క్యాన్సర్ కలాబరేషన్ కేర్ యూనిట్ (TWCC) మరియు పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సొసైటీ, హైదరాబాద్ మద్దతుతో అభివృద్ధి చెందిందన్నారు.ఈ కార్యక్రమంలో కర్నూలు మెడికల్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డా. శ్రీరాములు, అదనపు డీఎంహెచ్‌ఓ డా. భాస్కర్, అనస్థీషియా విభాగాధిపతి డా. సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

