NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విఆర్ఓ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి

1 min read

నందికొట్కూర్ లో రెవెన్యూ ఉద్యోగుల ధర్నా..

నందికొట్కూరు న్యూస్ నేడు: కర్నూలు జిల్లాలో పని ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్న వీఆర్వో మహమ్మద్ హుస్సేన్ మృతికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ రెవిన్యూ అధికారుల సంఘం ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ నర్సరాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని కోరారు. రెవిన్యూ ఎంప్లాయీస్ జేఏసి పిలుపు మేరకు విఆర్వోల సంఘం సంఘం అధ్యర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా నరసరాజు మాట్లాడుతూ సహోద్యోగి మహమ్మద్ హుస్సేన్ కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా  ప్రకటించాలని విఆర్ఓ ఆత్మహత్యకు కారణమైన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.వీఆర్వోలు,గ్రామ సర్వేయర్లు, వీఆర్ఏలకు పని ఒత్తిడి తగ్గించాలని సింగిల్ లైన్ మానిటరింగ్ సిస్టంను ఏర్పాటు చేయాలని అన్నారు.రెవెన్యూ సంఘం జిల్లా నాయకులు మహేష్ మాట్లాడుతూ విఆర్ఏ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బుద్ధకవి, తాలుకా ఏపిజిఈఎ నాయకులు జగదీష్,శ్రీనివాసులు మరియు విఆర్ఓ లు ఆనంద్,సురేష్,వెంకటేష్,మనోహర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

About Author