NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

1 min read

చిన్నారులు, గర్భిణులు, బాలింతలు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి

హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండల పరిధిలోని ఎల్లర్తి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలు-1, 2లో 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి హాజరై చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, మహిళలకు ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సమతుల్య ఆహారం ఎంతో అవసరమన్నారు. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు తదితర పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు కూడా పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు.కార్యక్రమంలో భాగంగా పీపీపీ కాల్స్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి, వాటి ప్రాధాన్యతను వివరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహార సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్యం, బరువు, ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవాలని తెలిపారు.ప్రజల్లో పోషకాహారంపై అవగాహన పెంచడం, చిన్నారులు మరియు మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా జాతీయ పోషణ మాసం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఇంద్రరాణి, లేపాక్షి, చిన్నారులు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *