వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డిపై దాడి అక్రమం
1 min read
తీవ్రంగా ఖండించిన ఎస్. నిసార్ అహ్మద్
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి: విజయవాడలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయం వద్ద మెగా డీఎస్సీ– 2025 క్రీడా కోటా నియామకాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ సోమ వారం వైఎస్సార్సీపీ నిర్వహించిన నిరసన సందర్భంగా చోటుచేసు కున్న ఘర్షణలో వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి గాయపడిన ఘటనను మదనపల్లె నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఎస్. నిసార్ అహ్మద్, అన్నమయ్య జిల్లా వైఎస్సార్టీయూసీ అధ్యక్షుడు వేణు గోపాల్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం స్థానిక వైసీపీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్ నిసార్ అహ్మద్ మాట్లాడుతూ డీఎస్సీ– 2025 క్రీడా కోటా నియామ కాల్లో అవక తవక లపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్సీపీ నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యం లో, సెప్టెంబర్ 21న విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు భారీగా మోహరించి నిరసన కారులను అడ్డు కోవడంతో పాటు లాఠీ చార్జ్, అరెస్టు లు జరిగి నట్లు పలు వార్తా సంస్థలు నివేదించాయి. అదే సమయంలో వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ వర్గాలు దాడికి పాల్పడ్డాయని ఆయన ఆరో పించారు. నిరుద్యోగ యువత భవిష్యత్తు కు సంబంధించిన డీఎస్సీ నియామకాలలో పారదర్శకత కోరడం వైఎస్సార్సీపీ చేసిన నేరమా? క్రీడా కోటా నియామకాల్లో అను మానాలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలిపిన నాయ కులు, కార్యకర్తలపై దాడులు చేయడం దురదృష్టకరమన్నారు. జిల్లా వై ఎస్ ఆర్ టి యు సి అధ్యక్షుడు వేణుగోపాల్ మాట్లాడుతూ పోలీసుల సమక్షం లోనే దాడులు జరిగాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే నిష్పాక్షిక దర్యాప్తు జరిపించా లని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


