NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈ-క్రాప్ బుకింగ్, ఈ-కేవైసీపై రైతులకు అవగాహన

1 min read

పంటల నమోదు తప్పనిసరి.. రైతులు ఆర్‌ఎస్‌కే సిబ్బందిని సంప్రదించాలి

ఈ-క్రాప్ బుకింగ్, ఈ-కేవైసీ పూర్తయితేనే పంట బీమా ప్రయోజనాలు

హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండలంలోని రైతు సేవా కేంద్రం (ఆర్‌ఎస్‌కే)లో మండల వ్యవసాయ అధికారి ఆనంద్ ఆధ్వర్యంలో రైతులు, ఆర్‌ఎస్‌కే సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు ఈ-క్రాప్ బుకింగ్, ఈ-కేవైసీతో పాటు పంట బీమా తదితర అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. మండలంలోని పంటల బీమా కట్టిన ప్రతి రైతు తప్పనిసరిగా ఈ-క్రాప్ బుకింగ్ చేయించుకోవాలని సూచించారు. ఈ-క్రాప్ బుకింగ్ చేసుకున్న తర్వాత ప్రతి రైతు తప్పనిసరిగా ఈ-కేవైసీ కూడా పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఇందుకోసం రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రం (ఆర్‌ఎస్‌కే) సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.ఈ-క్రాప్ బుకింగ్ మరియు ఈ-కేవైసీ పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే పంట బీమా పరిహారం పొందేందుకు అర్హత ఉంటుందని అధికారులు తెలిపారు. రైతులు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత సమయంలో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.అదేవిధంగా ఇతర ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, ప్రయోజనాలు పొందేందుకు కూడా రైతులు తమ పంట వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, ఏవైనా సందేహాలు ఉంటే రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఈఓతో పాటు ఆర్‌ఎస్‌కే సిబ్బంది విజయ్, రమేష్, శివప్రసాద్, రాజు నాయక్ తదితరులు, రైతులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *