పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి కి బృహత్తర అడుగు
1 min read
4 పట్టణ స్థానిక సంస్థలకు రూ.94 కోట్ల అభివృద్ధిపనులకు ఆమోదం
మదనపల్లెలో రూ.27 కోట్ల హెచ్‌ఏఎం అభివృద్ధి పనులకు శంకు స్థాపన
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి: పట్టణ ప్రాంతాల్లో ఆధునిక మౌలిక వసతులను అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఇందులో భాగంగా జిల్లాలోని 4 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మొత్తం రూ.94 కోట్ల విలువైన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ లో వివిధ మౌలిక వసతుల అభివృద్ధి పనులకు మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ లో తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 106 నియోజకవర్గాల్లోని 123 మున్సిపాలిటీ లలో ఒకేసారి రూ.11,360 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కుప్పం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వర్చువల్ గా శంకుస్థాపన చేసి పట్టణాల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల్లో రోడ్లు, సెంట్రల్ మీడి యన్లు, పార్కులు, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ నిధులను ఖర్చు చేయడం జరుగు తుందని ముఖ్య మంత్రి పేర్కొన్నారు.
స్థానిక ఎన్‌వీఆర్ కళ్యాణ మండపం లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో వర్చువల్ గా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొ న్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా లోని మదనపల్లె, రాయచోటి, బి.కొత్తకోట, పుంగనూరు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మొత్తం రూ.94 కోట్ల విలువైన పనులకు ప్రభుత్వ ఆమోదం లభించిందన్నారు. ఇందులో మదనపల్లె మున్సిపాలిటీకి రూ.27 కోట్లు, రాయచోటికి రూ.35 కోట్లు, బి.కొత్తకోటకు రూ.12 కోట్లు, పుంగనూరుకు రూ.20 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.
అన్నమయ్య జిల్లా లోని నాలుగు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులు పట్టణాల రూపు రేఖలను మార్చడం తో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు దోహదపడతాయని తెలిపారు.జిల్లా కేంద్రంగా మదనపల్లె ఏర్పడిన అనంతరం పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధి కి ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజల నుంచి జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చిన వివిధ విజ్ఞప్తులను ప్రభుత్వానికి నివేదించామని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడు తోందని పేర్కొ న్నారు. జిల్లా కేంద్రానికి అవస రమైన ముఖ్యమైన రహదారులు, డ్రైనేజీలు, పార్కులు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి జిల్లా మినరల్ ఫౌండేషన్ నిధులను విని యోగిస్తున్నామని ప్రకటించారు. ఇందు లో భాగంగా మదనపల్లె పట్టణం లోని సీటీఎం రోడ్డు అభివృద్ధి పనులు వేగంగా జరుగు తున్నాయని, ఇప్పటికే వెట్‌మిక్స్ పనులు పూర్తయ్యా యని, తుది దశలో బీటీ రోడ్డు పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. మరో పది రోజుల్లో ఈ పనులు కూడా పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. సీటీఎం రోడ్డును డబుల్ లేన్‌గా అభివృద్ధి చేయడం ద్వారా పట్టణ కేంద్రంలో మెరుగైన రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.స్థానిక శాసనసభ్యులు విజ్ఞప్తి మేరకు ఉపాధి హామీ పథకం కింద మదనపల్లె చుట్టు పక్కల ప్రాంతాల అభివృద్ధికి సుమారు రూ.8 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అలాగే జిల్లా మినరల్ ఫౌండేషన్ ద్వారా మదనపల్లె జిల్లాకేంద్ర అభివృద్ధికి గత నెలలో సుమారు రూ.10 నుంచి రూ.20 కోట్ల వరకు నిధులు మంజూరు చేసినట్లు వివరించారు.పట్టణాభివృద్ధిలో భాగంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద సుమారు రూ.27 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు పరిపా లనా అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అమృత్ 2.0 పథకం కింద ఇప్పటికే సుమారు రూ.35 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని చెప్పారు.స్వచ్ఛ భారత్ మిషన్ కింద తడి, పొడి వ్యర్థాలను వేరు చేసి సక్రమంగా నిర్వ హించేందుకు అవసరమైన ప్లాట్‌ఫారమ్‌ల నిర్మాణానికి సుమారు రూ.5 కోట్ల నిధులు మంజూరు కాగా, పనులు ఇప్పటికే పురోగతిలో ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహ కారంతో అమలవు తున్న అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగు పరిచేందుకు సుమారు రూ.56 కోట్ల ప్రతిపాదనలు అనుమతి దశలో ఉన్నాయని వివరించారు.పట్టణాన్ని పరి శుభ్రంగా ఉంచడం లో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం సిబ్బంది నిరంతరం కష్టపడుతున్నప్పటికీ, ప్రజలు కూడా తమ బాధ్యతను గుర్తించి సహక రించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మదనపల్లి మునిసిపల్ కమీషనర్ ప్రమీల, టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్,మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా కుమారుడు మహమ్మద్ జుబేద్ అక్బర్, వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ నవీన్, నాయకులు రాజన్న, రఘుపతి, నీలకంఠ, సంబంధిత మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.



