త్రాగునీరు సమస్య ఉంటే సచివాలయంలో తెలియజేయండి :ఎంపిడిఓ శ్రీనివాసరావు
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు : ప్యాపిలి పట్టణంలో త్రాగునీరు సమస్య ఉంటే దగ్గర్లో ఉన్న గ్రామ సచివాలయంలో తెలియజేయాలని మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు తెలిపారు.ఈ సందర్భంగా బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని పట్టణంలో త్రాగునీరు సమస్య పరిష్కారం కోసం వాటర్ ట్యాంక్ ల సౌకర్యం కల్పించాము, పట్టణంలోని ప్రజలు కాలనీ పేరు లేదా ఎన్నో వార్డు ను గ్రామ సచివాలయంలో తెలియజేసి నమోదు చేస్తే త్రాగునీరు వాటర్ ట్యాంక్ ట్రాక్టర్లు తో సరఫరా చేస్తామని ఆయన తెలిపారు.ప్రజలు ఇబ్బందులు పడకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.


