లింగపాలెం సొసైటీ అధ్యక్షులు మోరంపూడి మల్లికార్జునరావు కి మాతృ వియోగం
1 min read
అంత్యక్రియల్లో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్
కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఎం ఎల్ ఏ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: లింగపాలెం మండల సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మోరంపూడి రంగారావు సతీమణి,లింగపాలెం సొసైటీ అధ్యక్షులు మోరంపూడి మల్లికార్జునరావు మాతృమూర్తి మోరంపూడి ప్రభావతి (80) పరమపదించరు. చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ వారి అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని. కుటుంబానికి మనశ్శాంతిని కలగాలని తెలియజేసారు. ప్రభావతి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.



