NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంతర్జాతీయ యోగా కు… రిజిస్ట్రేషన్స్  పూర్తి చేయండి

1 min read

ఆర్టీసీ బస్ స్టాండ్  మరియు బస్సుల ద్వారా యోగా పై విస్తృతంగా ప్రచారం , రిజిస్ట్రేషన్ జరగాలి

జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్

కర్నూలు , న్యూస్​ నేడు: అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున యోగా చేసే సభ్యుల రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ యోగ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… కర్నూలు జిల్లా కలెక్టర్ నిర్దేశించిన ప్రకారం 4  లక్షల 62 వేల మంది యోగా చేసేవారు లక్ష్యంగా ఉన్నారని , ఆ సంఖ్యకు అధికంగా రిజిస్ట్రేషన్స్ జరగాలని వారందరూ జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున యోగా కార్యక్రమంలో పాల్గొనే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు. యోగ కార్యక్రమం పై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహిస్తున్నందున అంత లోపల ప్రజలు క్యూఆర్ కోడ్ ని వినియోగించుకుని రిజిస్ట్రేషన్ చేయించు కోవడానికి  అధికారులు వెంటనే చర్యలు తీసుకొని యోగాలో పాల్గొనే వారి  సంఖ్యను పెంచే దిశగా కృషి చేయాలని ఆదేశించారు. జిల్లాలో జూన్ 12న పాఠశాలలు మొదలవుతాయని కావున పాఠశాలల విద్యార్థులు  , అలాగే కాలేజీ విద్యార్థులను అధిక సంఖ్యలో క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేయించి వారందరూ యోగా కార్యక్రమంలో పాల్గొనే చర్యలు తీసుకోవాలని డీఈవో , ఆర్ఐఓ అధికారులను ఆదేశించారు.  జిల్లాలో యోగ కార్యక్రమం పై ఆర్టీసీ ద్వారా  విస్తృతంగా ప్రచారం , క్యూఆర్ కోడ్ అవగాహన ద్వారా విస్తృతంగా రిజిస్ట్రేషన్లు జరగాలని ఆదేశించారు. ఈ సమావేశానికి సీఈవో సెట్కూర్ వేణుగోపాల్ ,  జిల్లా పరిషత్ సీఈవో వెంకటరమణారెడ్డి , డిప్యూటీ డిఎంహెచ్ఓ భాస్కర్ , ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు , ఎక్సైజ్ సూపరింటెండెంట్  సుధీర్ బాబు , డిఆర్డిఏ పిడి రమణారెడ్డి , టూరిజం జోనల్ అధికారి లక్ష్మీనారాయణ , డి ఎస్ డి ఓ భూపతి ,  మెప్మా పీడీ శ్రీనివాసులు , డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి , ఆర్ ఐ ఓ , డి ఈ ఓ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

About Author