టిడిపి తీర్థం పుచ్చుకున్న కమతం భాస్కర్ రెడ్డి
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: తెలుగు దేశం పార్టీ అభివృద్ధిని చూసి వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద పూజర్ల గ్రామానికి చెందిన కమతం భాస్కర్ రెడ్డి డోన్ నియోజకవర్గం శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చేతూల మిదుగ తెలుగు దేశం పార్టీ కండువను కట్టించుకొని టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.ఈసందర్భంగా గురువారం ప్యాపిలి మండలంలోని పెద్ద పూజర్ల గ్రామాల్లో సభను ఏర్పాటు చేసి సభను అలంకరించన ముఖ్య అతిథిగా డోన్ నియోజకవర్గం శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి హాజరై వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కమతం భాస్కర్ రెడ్డి ని సగౌరవంగా ఆహ్వానించి తెదేపా లోనికి చేర్చుకున్నారు. ఆయన తోపాటు 500 కుటుంబలు పార్టీ లోనికి చేరారు. అనంతరం ఎమ్మెల్యే కోట్ల మాట్లాడుతూ కమతం భాస్కర్ రెడ్డి వైసీపీ నుండి టీడీపీలో చేరడం పార్టీకి శుభ సూచకం గ్రామంలో తెదేపా నాయకులు కార్యకర్తలు ఒకటై పార్టీకి సేవలందించాలని ఆయన కోరారు.ఈకార్యక్రమంలో తెదేపా యువ నాయకులు కోట్ల రాఘవేంద్ర రెడ్డి, తేదేపా లక్కసాగరం లక్ష్మి రెడ్డి, తేదేపా నాయకులు చండ్రపల్లి లక్ష్మి నారాయణ యాదవ్, ఆర్ ఇ నాగరాజు, మండల కన్వీనర్ సుదర్శన్, తేదేపా
నాయకులు గడ్డం ప్రసాద్ రెడ్డి,
కమతం అనిమి రెడ్డి, కమతం శివ శంకర్ రెడ్డి,అలే బాద్ పరమేష్, కుమ్మరి సుధాకర్,గుడి పాడు వెంకట రెడ్డి, సీమా సుధాకర్ రెడ్డి, రాజా నారాయణమూర్తి,గోల్ల రామ్మోహన్ యాదవ్, తేదేపా జనరల్ సెక్రెటరీ నడిగడ్డ నాగేంద్ర,ముస్లిం మైనారిటీ నాయకులు ఖాజా ఫీర్, రామ్మోహన్, బర్మా శ్రీధర్,పిక్కిలి బొలికొండ,కలచట్ల ప్రసాద్,హరి తదితరులు తేదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


