ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవధికార సంస్థ ఆదేశాల మేరకు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి సూచనల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి శుక్రవారం 12-06-2026 న కర్నూలు న్యాయ సేవా సదన్ నందు బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జడ్జి మాట్లడుతూ బాల కార్మిక వ్యవస్థ నిషేధ మరియు నియంత్రణ చట్టం 2016 ప్రకారం బాల బాలికల తో పని చేయించుకోవడం లేదా పనిలోకి అనుమతించడం పూర్తిగా నిషేధించడం అయినదని తెలిపారు. ఎవరైనా ఈ చట్టాన్ని ఉల్లంఘించి బాలలతో పని చేయించుకుంటే వారికి ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు. ప్యారా లీగల్ వాలెంటీర్స్ బాల కార్మికత వల్ల కలిగే హానికరమైన శారీరక మానసిక ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.పిల్లలను పాఠశాలలకు వెళ్లేలా కృషి చేయాలని కోరారు.లేబర్ ఆఫీసర్ కేశన్న మాట్లాడుతూ బాల బాలికలతో షాపులందుగాని ఫ్యాక్టరీలందు గానీ పనిచేయించుకోవడం నేరమని తెలిపారు. డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద మాట్లాడుతూ ఎవరికైనా బాల కార్మికులు కనిపిస్తే 1098 కి గాని లేదా లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 గాని కాల్ చేసి తెలుపవలసిందిగా ప్రజలను కోరారు. ఎన్జీవో డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ జూన్ నెల అంత నగరంలో పర్యటించి బాల కార్మికులను గుర్తించి వారిని తిరిగి పాఠశాలలకు వెళ్లేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు.జడ్జి బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు . అనంతరం జిల్లా న్యాయ సేవ సదన్ నుండి కొండారెడ్డి బురుజు వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కర్నూల్ లేబర్ ఆఫీసర్ కేశన్న, కర్నూలు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద , లీగల్ సర్వీసెస్ నెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, పోలీసులు,బాల సంరక్షణ ఎన్జీవోస్ మౌనిక, ప్యానల్ లాయర్స్, ప్యారా లీగల్ వాలంటీర్స్, తదితరులు పాల్గొన్నారు.


