అన్ని విభాగాధిపతులతో సమీక్ష సమావేశం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కె. వెంకటేశ్వర్లు అన్ని విభాగాధిపతులతో (HODs) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై పలు కీలక అంశాలను చర్చించారు.రోగులకు అవసరమైన పరీక్షల శాంపిల్స్ మరియు మందులను అనవసరంగా బయటకు రాయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.మందులను తప్పనిసరిగా బయటికి రాయాల్సి వస్తె తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.అలాగే నెక్స్ట్ జెన్ ఈ-హాస్పిటల్ వెబ్సైట్లో పలు విభాగాల పనితీరు శాతం తక్కువగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పీజీలు మరియు ఇంటర్న్‌లకు అవగాహన కల్పించి శాతాన్ని పెంచవచ్చు అని సూచించారు.అదేవిధంగా అన్ని విభాగాలు ఓపి సమయాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది ఎవరైనా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసిన వెంటనే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఆసుపత్రిలో శానిటేషన్ బిన్స్ లేదా కవర్ల కొరత ఉన్నా వెంటనే సమాచారం అందించాలని సూచించారు.ఈ సమావేశంలో ఆసుపత్రి సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చేందుకు అవసరమైన పలు చర్యలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కె వెంకటేశ్వర్లు గారితో పాటు ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్స్ పాల్గొన్నారు.


