NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలు కాలర్ ఎగరేసి రాజులా బ్రతకాలి

1 min read

10 శాతం మీరు కష్టపడండి

 90 శాతం మేము కష్టపడతాం

నందికొట్కూరు ఇన్చార్జి డాక్టర్ సుధీర్

నాయకులకే వందల కొద్దీ యూరియా

నియోజకవర్గ పరిశీలకులు బుడ్డా శేషారెడ్డి..

నందికొట్కూరు న్యూస్ నేడు: నందికొట్కూర్ ప్రజలు కాలర్ ఎగరేసి రాజుల బ్రతకాలనిరానున్న ఎన్నికల్లో పది శాతం మీరు కష్టపడండి 99 శాతం మేము కష్టపడతాం 10 శాతం మీరు ఖర్చు చేయండి 90 శాతం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మరియు నేనూ ఖర్చు చేస్తామని నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో శుక్రవారం’చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం విజయవంతమైంది.పార్టీ కార్యాలయం నుండి పటేల్ సెంటర్ వరకు భారీగా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.పటేల్ విగ్రహానికి డాక్టర్ సుధీర్ మరియు నందికొట్కూరు పరిశీలకులు బుడ్డా శేషారెడ్డి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బుడ్డా శేషారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంలో నాయకులకు వందలకొద్దీ యూరియా బస్తాలు పోటీ పడుతున్నారు మరి సామాన్య ప్రజలకు యూరియా బస్తాలు ఏమి ఇస్తారని మండిపడ్డారు.

ఇంతవరకూ దొరకని ముచ్చుమర్రి వాసంతి బాడీ

కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో డాక్టర్ సుధీర్ విరుచుకుపడ్డారు.ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేస్తారని ముచ్చుమర్రి బాలిక వాసంతి రెండేళ్లయినా ఇంతవరకూ బాడీ దొరకలేదని ప్రభుత్వం ఏమి చేస్తోందని  ఆగ్రహం వ్యక్తం చేశారు. నందికొట్కూర్ చుట్టూ నీళ్లు ఉన్నా మనకు నీళ్లు లేని పరిస్థితి.ప్రతి పంటలో రైతుకు గిట్టుబాటు ధర లేదు వ్యవసాయ మందుల ధరలు అధికంగా పెరిగాయి దళారులతో ఎక్కువ ధరకు యూరియా అమ్ముతున్నారు పట్టణ మున్సిపాలిటీ కార్యాలయంలో అవినీతి ఎక్కువగా అయిందని కుక్కల కుటుంబ నియంత్రణకు 5 లక్షల రూపాయలు కొట్టేశారని ఇలా చాలా అవినీతి జరిగిందని ప్రజలకు వివరించారు.నారా లోకేష్ కనుసన్నల్లోనే డీఎస్సీ నియామకాలు జరిగాయి పరీక్షలు రాయని వారికి ఉద్యోగాలు వచ్చాయని మండిపడ్డారు.వచ్చే ఎన్నికల్లో ప్రతివాడలో వైసీపీ జెండా రెపరెపలాడాలి.నేను చనిపోయేంత వరకు నందికొట్కూర్ ప్రజలతోనే ఉంటా ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని డాక్టర్ సుధీర్ కార్యకర్తలకు భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు,ఎంపీపీలు,ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Author