చంద్రబాబు అభివృద్ధి రాజకీయాల ముందు వైసీపీ ప్రతిపక్ష రాజకీయాలు నిలబడలేవు
1 min read
ఆలూరు టీడీపీ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి
ఆలూరు న్యూస్ నేడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడుల ఆకర్షణ దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నాయని ఆమె పేర్కొన్నారు.శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల సమీకరణ, యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు.ప్రజలు స్పష్టమైన తీర్పుతో వైఎస్సార్సీపీని తిరస్కరించి కూటమి ప్రభుత్వానికి బాధ్యతలు అప్పగించారని, ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి వైఎస్సార్సీపీ నాయకులు అసహనంతో విమర్శలు చేస్తున్నారని ఆమె విమర్శించారు.గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అనేక రంగాల్లో వెనుకబడిందని, ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతుండటాన్ని వైఎస్సార్సీపీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. ప్రజల సమస్యలపై నిర్మాణాత్మక సూచనలు చేయకుండా కేవలం విమర్శలకే పరిమితమవడం ఆ పార్టీ రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని అన్నారు.అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి, రహదారుల అభివృద్ధి, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి కీలక అంశాల్లో కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని ఆమె తెలిపారు.ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన వైఎస్సార్సీపీ రోజురోజుకు ప్రజలకు దూరమవుతోందని, అభివృద్ధిని అడ్డుకోవాలనే రాజకీయాలతో ఆ పార్టీ మరింత బలహీనపడుతుందని వైకుంఠం జ్యోతి పేర్కొన్నారు.రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని, ప్రజల ఆశీర్వాదం ఉన్నంతకాలం అభివృద్ధి యాత్రను ఎవరూ అడ్డుకోలేరని ఆమె స్పష్టం చేశారు.


