చంద్రబాబు వెన్నుపోటు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు
1 min read
ఆలూరు న్యూస్ నేడు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” భారీ ర్యాలీ మరియు నిరసన కార్యక్రమాన్ని ఆలూరు నియోజకవర్గంలో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల కన్వీనర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, రాష్ట్ర మరియు జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ మరియు బీవీఆర్ అభిమానులు, యువజనులు, రైతులు, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అభినందనీయమని అన్నారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తాయని, ప్రజల హక్కుల సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన ప్రతి నాయకుడు, కార్యకర్త, అభిమాని మరియు ప్రజలకు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.


