NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సర్​ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ సమావేశంలో పాల్గొన్న మండల కన్వీనర్

1 min read

అలూరు, న్యూస్​ నేడు:  ఆలూరు నియోజకవర్గ ఇంచార్జ్  వైకుంఠం జ్యోతి  ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన  సర్​  (Special Intensive Revision) ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నియోజకవర్గ స్థాయి సమావేశం శనివారం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో మండల కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి  మాట్లాడుతూ, జూన్ 15 నుండి జూలై 14 వరకు నెల రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), బూత్ లెవల్ అధికారులు (BLOలు) సమన్వయంతో ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.ఓటరు జాబితాలో ఉన్న లోపాలను సరిదిద్దడం, నకిలీ ఓటర్లను గుర్తించడం, మరణించిన వారి పేర్లను తొలగించడం, కొత్త అర్హులైన ఓటర్లను నమోదు చేయడం వంటి కార్యక్రమాలను పారదర్శకంగా నిర్వహించి, ఓటరు జాబితాలో ఎలాంటి అవకతవకలు లేకుండా చూడాలని ఆమె పిలుపునిచ్చారు.అనంతరం క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయి నాయకులకు మరియు కార్యకర్తలకు SIR కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను వైకుంఠం జ్యోతి  స్వయంగా అందజేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని ఆమె సూచించారు.ఈ సమావేశంలో పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జీలు, బూత్ స్థాయి కార్యకర్తలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

About Author