అమావాస్య సందర్భంగా దేవరగట్టులో భక్తుల రద్దీ
1 min read
హోళగుంద న్యూస్ నేడు: అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని దేవరగట్టులోని శ్రీ మళమల్లేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.ఈ సందర్భంగా శ్రీ మళమల్లేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకం, బిల్వార్చన, బండారు అర్చనలు నిర్వహించగా, అమ్మవారికి కుంకుమార్చన, ఆకు పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు గిరి స్వామి, మనోహర్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.అలాగే చిన్నారులకు కుంకుమ, బండారు అట్టిస్తూ ఆశీర్వాదాలు అందజేశారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.అమావాస్య సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలో ముంచెత్తాయి. దేవరగట్టులో భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు భక్తి పారవశ్యంతో నిండిపోయాయి.

