NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దైవ దర్శనానికి వచ్చి మృత్యుఒడిలోకి

1 min read

కర్నాటక ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడు మృతి

మంత్రాలయం న్యూస్ నేడు : ఎద్దేళు బంగారు..కార్తీక నినగే అవాగులే నూరు వర్ష ఆయుతా బంగారా.. నావు ఎంగే ఇరబేకు బంగారా.. రాయర దర్శనకె బందు ఈగాయుతు ఏనప్ప.. అని తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు వర్ణనాతీతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు కుటుంబ సభ్యుల తో కలిసి వచ్చి దర్శించుకుని అనంతరం కర్నాటక ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడు మృతి చెందిన సంఘటన మంత్రాలయం లో మంగళవారం చోటు చేసుకుంది. మంత్రాలయం ఎస్సై మల్లికార్జున తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక లో మైసూరు జిల్లా కృష్ణ రాజనగర్ తాలుకా కొప్పరగహల్లి గ్రామానికి చెందిన హరీష్ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సోమవారం రాత్రి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. ఉదయం రాఘవేంద్ర స్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనం కోసం బయలు దేరారు. అయితే మంత్రాలయం గోశాల దగ్గర ఉన్న శ్రీ అభయాంజనేయస్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇంతలో హరీష్ కుమారుడు కార్తీక్ (5)అనే బాలుడు రోడ్డు దాటుతుండంగా మంత్రాలయం నుండి రాయచూరు వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు బాలుడు ని ఢీకొనడంతో ఆ బాలుడు బస్ వెనుక చక్రాల కింద పడడంతో టైర్ తలపై వెళ్లడంతో నుజ్జునుజ్జు అయి అక్కడికి అక్కడే బాలుడు మృతి చెందాడు. ఇది చూసిన తల్లిదండ్రులు, బంధువులు గుండేపగలేలా కన్నీరు మున్నీరుగా విలపించారు. వీరి తో పాటు బంధువులు, భక్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి బాలుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడు తండ్రి హరీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లికార్జున తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *