NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి ఆహ్వానం

1 min read

హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండలంలోని హెబ్బటం గ్రామంలో జూన్ 21, 2026న నిర్వహించనున్న భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి సంబంధించి గ్రామ నాయకులు, ఎంఆర్‌పీఎస్ నాయకులు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డా. బి.ఆర్. అంబేద్కర్ సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. రాజ్యాంగ రూపకర్తగా దేశ ప్రజలకు సమాన హక్కులు కల్పించడంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు.అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి సామాజిక న్యాయం, సమానత్వం, సోదరభావం పెంపొందించే దిశగా కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. హెబ్బటం గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గ్రామ ప్రజలు, యువత, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సామాజిక సంఘాల ప్రతినిధులు, ఎంఆర్‌పీఎస్ నాయకులు, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.     

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *