నూతనంగా నిర్మించనున్న జో మరియా బాలికల వసతి గృహం శంకుస్థాపన
1 min read
శంకుస్థాపన కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదవేగి మండలం దుగ్గిరాలలోనీ సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న “జో – మరియా బాలికల వసతి గృహం” నిర్మాణ పనులకు మంగళవారం ఉదయం ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరావ్ పొలిమేర ఆధ్వర్యంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాలకు విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి కళాశాల నిర్వాహకులు, పలువురు ఫాదర్లు శాలువాలతో సత్కరించి పుష్పగుత్యాలను అందించారు.

