NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా జైలు లో  న్యాయ అవగాహన సదస్సు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  17-06-2026 వ తేదిన   జిల్లా ప్రధాన న్యాయ మూర్తి / జిల్లా న్యాయ సేవాది కార సంస్థ అధ్యక్షులు జి. కబర్థి మరియు  బి. లీలా వెంకట శేషాద్రి , కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాది కార సంస్థ, కర్నూల్  వారు జిల్లా కారాగారము నందు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.  ఈ సందర్భంగా  జిల్లా జడ్జి  జైలు నందు ఏర్పాటు చేసిన      ప్రిజన్ లీగల్ ఎయిడ్   క్లినిక్ ను మరియు ములాఖత్ హెల్ప్ డెస్క్ ను తనిఖీ చేసి “జైలు ఖైదీలకు ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్స్ మరియు  ములాఖత్  హెల్ప్ డెస్క్ ” గురించి వివరించారు. ఇందులో ఒక అడ్వకేట్, ఒక ప్యారా లీగల్ వాలంటీర్ ఉంటారని, వారు ఖైదీలకు న్యాయ సహాయాలు అందిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా జైలులో ఉన్న ఖైదీలు వారి కున్న హక్కుల ను తెలుసు కోవాలని తెలిపారు.ఖైధి లకు ఎవరికైనా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు.  70 ఏళ్ళు వయస్సు పై బడిన ఖైధిలకు, అనారోగ్యంతో బాధ పడే వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తా మని త్యరగా బెయిల్ మంజూరు అయ్యేలా కృషి చేస్తామని తెలిపారు.   ఖైధి లకు అందించే ఆహారాన్ని,రేషన్ ను వారి ఆరోగ్యం గురించి తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ఖైధి లను కోర్ట్ వాయిదా లకు కచ్చితంగా హాజరు చెయ్యాలని ఆదేశించారు.ఏవైనా సమస్యలుంటే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కర్నూలు వారిని సంప్రదించవచ్చును అన్నారు,  లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 పై ప్రచారం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జైలు అధికారులు, లీగల్ ఎయిడ్ న్యాయవాదులు శివరాం మరియు సులోచన, హెల్ప్ డెస్క్ న్యాయ వాది ప్రవీణ్ కుమార్, ప్యారా లీగల్ వాలెంటీర్స్ హేమంత్, ఓం ప్రకాష్, శివాని,ఖైదీలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *