NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బి.టెక్ విద్యార్థుల  కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ పై వర్క్ షాప్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 117 ఎస్  అలియన్స్ క్లబ్ ఆఫ్ గ్రేటర్ కర్నూల్,   నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా,నైస్ యూత్ ఫర్ కల్చర్  అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ల సంయుక్త ఆధ్వర్యంలో  కళాశాల విద్యార్థులకు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టులో భాగంగా  నేడు నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో జరిగిన వర్క్ షాప్ లో అసోసియేషన్ అఫ్ అలయన్స్ క్లబ్స్  ఇంటర్నేషనల్ మాజీ ఇంటర్నేషనల్ కౌన్సిల్ చైర్ పర్సన్ లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్  మెల్విన్ జోన్స్ ప్రతినిధి  అల్లీ అండ్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ  సమాజ సేవ పట్ల విద్యార్థుల్లో బాధ్యత పెంపొందించడం,గ్రామీణ మరియు పట్టణ సమస్యలను గుర్తించడం.పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, డిజిటల్ అక్షరాస్యతపై  అవగాహన కల్పించడం,ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం,యువతకు జీవన నైపుణ్యాల  శిక్షణ,మహిళా సాధికారతపై అవగాహన కల్పించడం తదితర అంశాలపై కళాశాల విద్యార్థులకు అవగాహన కొరకు ఈ వర్క్ షాప్ ను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ వర్క్ షాప్ లో ట్రైనర్స్ గా  లయన్ టి. గోపీనాథ్, లయన్  దామోదర్  లు  పాల్గొన్నారు. అనంతరం వర్క్ షాప్ లో పాల్గొన్న  మొదటి 30 మంది  విద్యార్థులకు  సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. కళాశాల విద్యార్థుల కమ్యూనిటీ ప్రాజెక్టు  కొరకు  9396861308  మొబైల్ నంబర్ ను సంప్రదించవచ్చన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *