NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాయి బ్రాహ్మణుల ఆత్మగౌరవం, అభివృద్ధికి తెలుగుదేశం పార్టీయే భరోసా:   

1 min read

కోట చంద్రశేఖర్

శ్రీకాళహస్తి , న్యూస్​ నేడు:  నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ హయాంలోనే రాజకీయ గుర్తింపు, ఆర్థిక స్వావలంబన, సామాజిక గౌరవం లభించాయని తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంట్ సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ…. తెలుగుదేశం పార్టీ స్థాపన నుంచే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు నాయి బ్రాహ్మణుల వంటి సాంప్రదాయ వృత్తిదారుల అభ్యున్నతికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాజకీయ గుర్తింపులో మార్పు  గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాయి బ్రాహ్మణ వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు, నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా రాజకీయంగా బలోపేతం చేశారని గుర్తు చేశారు. “మా వర్గం నుంచి ఎంతో మంది యువకులకు పార్టీలో అవకాశాలు వచ్చాయి. ఇది కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైంది” అని ఆయన అన్నారు.

ఆర్థిక అభివృద్ధికి అండ  :

నాయి బ్రాహ్మణుల సాంప్రదాయ వృత్తిని కాపాడుతూ, ఆధునీకరణ దిశగా ప్రభుత్వ పథకాలు అమలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చెప్పారు. సెలూన్ షాపుల ఆధునీకరణ, ఉచిత కిట్ల పంపిణీ, రుణ సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాల ద్వారా వేలాది కుటుంబాలు లబ్ధి పొందాయని తెలిపారు. భవిష్యత్తులోనూ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మా వర్గానికి మరింత చేయూత అందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

యువతకు పిలుపు  :

రాజకీయంగా ఎదగాలంటే యువత తెలుగుదేశం పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోట చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా పార్టీ సాధించిన అభివృద్ధిని విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని, గ్రామస్థాయి వరకు సాధికార సమితి ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.”నాయి బ్రాహ్మణులు కేవలం వృత్తిపరంగా కాకుండా, రాజకీయంగా, సామాజికంగా కూడా ఎదగాలి. ఆ దిశగా తెలుగుదేశం పార్టీ మాకు అండగా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో మా వర్గం నుంచి మరిన్ని మంది ప్రజాప్రతినిధులుగా ఎదగడానికి మార్గం సుగమవుతుంది” అని ఆయన పేర్కొన్నారు.తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం, అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉందని, అందుకే నాయి బ్రాహ్మణులు ఎప్పుడూ పార్టీకి అండగా ఉంటారని కోట చంద్రశేఖర్ తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *